![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -158 లో... ప్రేమ, నర్మద, వేదవతి ముగ్గురు కలిసి రామరాజుని ట్రైనింగ్ వెళ్ళడానికి ఒప్పించాలని ముందే ప్లాన్ చేసుకుంటారు. ఇక రాత్రి అందరు ఒక దగ్గర కూర్చొని ఉంటారు. నాకు ఒక మొక్కు ఉంది అందరం వెళ్ళాలని వేదవతి టాపిక్ స్టార్ట్ చేస్తుంది అయితే అందరం వెళదామని రామరాజు అనగానే నాకు ఇప్పుడు వీలు అవ్వదని నర్మద అంటుంది.
ఎందుక వేదవతి అడుగుతుంది. అంటే నాకు హైదరాబాద్ లో రెండు రోజులు ట్రైనింగ్ ఉందని చెప్తుంది. అలా ఎలా అవుద్దని వేదవతి కావాలనే యాక్టింగ్ చేస్తుంది. ఇన్ని రోజులు కష్టపడ్డ జాబ్ ఎందుకు పోగొట్టుకోవడమని ప్రేమ అంటుంది. సరే నేను ఒప్పుకుంటున్నానని వేదవతి అంటుంది. అయిన అయన కూడా ఒప్పుకోవాలి కదా అని వేదవతి అంటుంది. మావయ్య గారు వద్దని అంటారని శ్రీవల్లి అంటుంది. ఆయన మాత్రం ఎందుకు ఒప్పుకోరని వేదవతి అనగానే సరే అని రామరాజు అంటాడు. అయినా ఒక్కతి ఎలా వెళ్తుందని శ్రీవల్లి అనగానే.. మన నడిపోడు ఉన్నాడు కదా ఇద్దరు కలిసి వెళ్తారని వేదవతి అంటుంది.
నర్మద ట్రైనింగ్ కి వెళ్ళడానికి శ్రీవల్లి ఎంత ఆపాలని చూసిన తన ప్లాన్ ఫెయిల్ అవుతుంది. నర్మద, సాగర్ వెళ్ళడానికి రామరాజు ఒప్పుకుంటాడు. ఆ తర్వాత ప్రేమ, నర్మద, వేదవతి హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత మీరు ముగ్గురు ఒకటి మీ సంగతి చెప్తానని భాగ్యంకి ఫోన్ చేసి శ్రీవల్లి జరిగిందంతా చెప్తుంది. నువ్వు మెల్లగా మీ అత్తని నీ గుప్పిట్లోకి తెచ్చుకోమని భాగ్యం సలహా ఇస్తుంది. మరోవైపు ధీరజ్ ఆలోచిస్తుంటే ప్రేమ తన దగ్గరికికి వస్తుంది. ఈ రెండు వేల్లల్లో ఒక వేలు పట్టుకోమని ధీరజ్ అనగానే ప్రేమ పట్టుకుంటుంది. ఇదొక వింత మన ఇద్దరి ఆలోచనలు కలిసాయని ధీరజ్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |